స్వచ్చమైన నీటికి రంగు ఉండదు కాని అదే నీటి తో తయారైన ఐస్ క్యూబ్ లు తెల్లగా ఉంటాయి ఎందుకు ?
💧స్వచ్చమైన నీటికి రంగు ఉండదు కాని అదే నీటి తో తయారైన ఐస్ క్యూబ్ లు తెల్లగా ఉంటాయి ఎందుకు ? తెలుపు అనేది ఒక రంగు కాదు ... అన్ని రంగుల మేలు కలయికే తెలుపు . ఒక వస్తువుగుండా దృశ్య కాంతి లోని ఏడు రంగులు యధేచ్చగా తరిగిపోకుండా పతనమైన (incident) దిశలోనే ప్రసరిస్తే ఆ వస్తువు ను పారదర్శక వస్తువు (TransparentBody) అంటాము . అదే వస్తువు ముక్కలు ముక్కలు గా ఉన్నప్పుడు గానీ .. ఒకే విధమైన అంతర్గత నిర్మాణము లేనపుడు గానీ దాని మీదపడే కాంతి (IncidentLight) పలు దిశల్లో వక్రీభవనం (Refraction) చెంది వివిధ మార్గాల ద్వారా బయటకు వస్తుంది . ఇలా అన్ని వైపూలనుండి తెలుపు కాంతి రావడం వల్ల ఎటు నుంచి చూసినా ఆ వస్తువు తెల్లగా కనిపిస్తుంది. గాజు పలక పారదర్శకం గ కనిపించినా దాన్ని పొడిగా నూరితే సుద్ద పోడిలా తెల్లగా కనిపిస్తుంది . ఇందుకు కారణమూ శ్వేత కాంతి (WhiteLight)పలు దిశల్లో వెదజల్లు కోవడమే (ScatteredLight) . ఐస్ క్యూబ్లలో కుడా వక్రీభవన దిశలు మారి తెల్లని కాంతి పలు మార్గాల్లో బయట కు వస్తుంది . . . అందుకే తెల్లగా కనిపిస్తుంది.